AP News:ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..మహిళలతో పాటు వారికి కూడా ఫ్రీ బస్సు!

by Jakkula Mamatha |
AP News:ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..మహిళలతో పాటు వారికి కూడా ఫ్రీ బస్సు!
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే..మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ మహిళలు ఈ పథకం కోసం ఆసక్తిగా..ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఎప్పుడు అమల్లోకి వస్తుందాని పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ ఈ పథకం కింద మరో కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళలకు మాత్రమే కాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పెన్షన్లు తీసుకునే వారికి కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని భావిస్తోందని సమాచారం.

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్య సేవలను పొందేందుకు ఉచితంగా బస్ పాస్‌లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందంట. గుండె జబ్బులు, కిడ్నీ, పక్షవాతం, లివర్, తలసేమియా, లెప్రసీ, సీవియర్ హీమోఫిలియా వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఫ్రీ బస్సు సదుపాయం కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో 51 వేల మందికి మేలు జరగనున్నట్లు తెలుస్తోంది. చికిత్స కోసం పట్టణాల్లోని ఆస్పత్రులకు వచ్చి వెళ్లేందుకు రోగులకు రూ.200 నుంచి రూ.600 ఖర్చు అవుతుంది. ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఈ ఖర్చు నుంచి ఉపశమనం లభించనుంది. కానీ ఈ పథకం పై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఒక వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి గొప్ప మేలు చేసినట్లు అవుతుందంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed