APSRTC:ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కీలక ప్రకటన

by Jakkula Mamatha |   ( Updated:2024-12-03 14:48:59.0  )
APSRTC:ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free bus travel) అమలు చేస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడెప్పుడా అని మహిళలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్(APSRTC Chairman) కొనకళ్ల నారాయణ(Konakalla Narayana) కీలక వ్యాఖ్యలు చేశారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు కోసం అధ్యయనం చేస్తున్నట్లు కొనకళ్ల నారాయణ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ప్రయాణికులకు APSRTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణ శుభవార్త చెప్పారు. కొత్తగా 1600 బస్సులను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చామని, బస్సులను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చామని, వీటిలో ఇప్పటికే 900 బస్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు. వీటిని రాష్ట్రవ్యాప్తంగా నడుపుతామని పేర్కొన్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు పథకం పై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. మరికొన్ని రోజుల్లో విధివిధానాలు ప్రకటించి, పథకం అమలు చేస్తామని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed