- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Nara Lokesh:పార్టీ కార్యకర్తలకు గుడ్ న్యూస్.. మంత్రి లోకేష్ కీలక నిర్ణయం
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ(TDP) సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా మంత్రి లోకేశ్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో నేడు(గురువారం) ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh), యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు MOUపై సంతకాలు చేశారు. కోటి మంది కార్యకర్తల కోసం ఒకేసారి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే తొలిసారిగా చెబుతున్నారు. అయితే ఈ ఒప్పందం ప్రకారం 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కోటి మంది కార్యకర్తల బీమా కోసం తొలివిడతలో రూ.42 కోట్లు పార్టీ చెల్లించింది.
వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద బీమా(Accident insurance) లభిస్తుంది. కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటి వరకు రూ.138 కోట్లు ఖర్చు చేశారు. వైసీపీ హయాంలో కేసుల్లో ఇరుక్కున్న కేడర్ కోసం న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేశారు. వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. మృతిచెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్‌తో పాటు కృష్ణా జిల్లా(Krishna District) చల్లపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్(NTR Trust) తరఫున రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఉచితంగా విద్య అందిస్తున్నారు. పార్టీ కేడర్‌ను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు మంత్రి లోకేష్ చేస్తున్న కృషి పై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Davos Summit: దావోస్ సదస్సుకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు, నారా లోకేష్