- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:రైతులకు గుడ్ న్యూస్..సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతులు అడిగిన వెంటనే సూక్ష్మసేద్యం పథకం మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూక్ష్మసేద్యం అమలు చేయడంపై దృష్టి పెట్టింది. ఇక అవసరం ఉన్న ప్రతి రైతుకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రైతు తన వాటా మొత్తం చెల్లిస్తే..వెంటనే పరికరాలు బిగించేలా కొత్త పథకాన్ని నేటి (శుక్రవారం) నుంచే అమలు చేయనుంది. ఈ ఏడాది 2.50 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అమలుకు తొలుత అధికారులు నిర్ణయించారు. ఉద్యాన రంగాన్ని ప్రోత్సహించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో 7.50 లక్షల ఎకరాలకు పెంచారు. పరికరాలు సమకూర్చేలా 33 కంపెనీల ప్రతినిధులతో అధికారులు భేటీ అయ్యారు.