- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP:మందుబాబులకు గుడ్ న్యూస్..సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈక్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై పత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో నేడు సీఎం చంద్రబాబు పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారనే విషయం తెలిసిందే. రాష్ట్రంలో మద్యం కొత్త విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగినట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే లిక్కర్ పాలసీ పై ప్రాథమిక ప్రతిపాదనలను ఎక్సైజ్ శాఖ రూపొందించింది. ఆబ్కారీ శాఖ ప్రతిపాదనలపై నేడు (బుధవారం) ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం మద్యం విధానం సెప్టెంబర్ చివరి నాటికి ముగియనుంది. లిక్కర్ బాటిల్స్‌కు నకిలీ హోలోగ్రాం సీల్ విషయంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.