Tirumala Tirupati Devasthanams : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్

by Prasanna |   ( Updated:2023-09-26 04:29:41.0  )
Tirumala Tirupati Devasthanams : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్
X

దిశ,వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ నేటి నుంచి వసతి గదుల్ని విడుదల చేస్తోంది. తిరుమలలో డిసెంబర్ నెలకు సంబంధించిన ఆన్‌లైన్ గదుల కోటాను ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమలకు వెళ్లాలనే భక్తులు ఈ విషయాన్ని గమనించి గదులు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఇప్పటికే డిసెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ భక్తులు, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగుల కోటా దర్శన టికెట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story