- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్తను అందించారు. మంగళగిరిలో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం సీకే కన్వెన్షన్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ భేటీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సమావేశంలో.. ఏపీలో ఎన్డీఏ 100 రోజుల పాలనపై చర్చించారు. అలాగే ఈనెల 20-26 వరకు ఇంటింటికీ ఎమ్మెల్యేలు కార్యక్రమం చేపట్టాలని, ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలనను ప్రజలకు వివరించేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
అలాగే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు.. అర్హులైన లబ్ధిదారులకు సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీపావళి పండుగ నుంచి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామని.. పండుగ రోజు లబ్ది దారులకు మొదటి సిలిండర్ అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. దీంతో రాష్ట్ర ప్రజలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఇవ్వనుంది. ఒకవేళ ఎవరైనా మూడు కంటే ఎక్కువ ఉపయోగిస్తే మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన ధర చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది.