Breaking: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్... చెల్లింపులు ప్రారంభం

by srinivas |   ( Updated:2023-03-12 17:28:49.0  )
Breaking: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్... చెల్లింపులు ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిల చెల్లింపులు ప్రారంభించింది. ఇటీవల ఉద్యోగులు ఆందోళనలు చేపట్టిన దృష్టా సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నెల చివరి వరకూ రూ. 3 వేల కోట్లు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఆ దిశగా అడుగులు వేసింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్ణయం మేరకు చెల్లింపులు మొదలు పెట్టింది. ఏపీజీఎల్‌ఐ క్లెయిమ్ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల జీపీఎఫ్ బిల్లులను కూడా ఏపీ ఆర్థిక శాఖ క్లియర్ చేస్తోంది. దీంతో ఉద్యోగులకు నిధుల పట్ల ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story

Most Viewed