- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకు రక్షణ కల్పించండి.. ఏపీ హైకోర్టులో రఘురామ పిటిషన్
దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నానని.. తనకు వెంటనే రక్షణ కల్పిచాలని కోరుతూ.. నరసాపురం ఎపీ రఘురామకృష్ణ రాజు ఏపీ హైకోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలో పోలీసులు ఇప్పటికే తనపై అక్రమంగా కేసులు పెట్టారని ఆయన తరఫు న్యాయవాదులు ఉమేష్ చంద్ర, వై.వీ. రవిప్రసాద్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గతంలో ఏపీ సీఐడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేసి కొట్టారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో రఘురామకృష్ణరాజు పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. కేసు నమోదై, ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు అయితేనే 41ఏ నిబంధనలు వర్తిస్తాయన్నారు. తాజాగా ఆయనపై ఎలాంటి కేసులు పెట్టలేదని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు వెల్లడిస్తామని తెలిపింది.