- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైఎస్ఆర్ ఆస్తులకు మాత్రమే జగన్ వారసుడు.. ఆశయాలకు మేమే వారసులం
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల దగ్గరపడుతున్న వేళ ఏపీ కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాజమండ్రిలో కాంగ్రెస్ ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తామని ప్రకటించారు. వైఎస్ ఆస్తులకు మాత్రమే జగన్ వారసుడు అని.. వైఎస్ ఆశయాలకు షర్మిలతో పాటు కాంగ్రెస్ శ్రేణులమంతా వారసులం అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని తెలిపారు. కాగా, రాజ మహేంద్రవరం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజును అధిష్ఠానం ఖరారు చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రాంతానికి చెందిన రుద్రరాజు కాంగ్రెస్‌లో సీనియర్ నేత. కార్యకర్త స్థాయి నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు.