AP News: వెలుగులోకి వైసీపీ ప్రముఖ నేత ఘరానా మోసం.. లక్షల్లో కుంభకోణం..

by Indraja |   ( Updated:2024-04-03 11:48:59.0  )
AP News: వెలుగులోకి వైసీపీ ప్రముఖ నేత ఘరానా మోసం.. లక్షల్లో కుంభకోణం..
X

దిశ వెబ్ డెస్క్: ఉద్యోగం పేరుతో వైసీపీ నేత నిరుద్యోగులని మోసం చేసిన ఘటన గుడివాడలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. వైసీపీ నేత వెంపటి సైమన్ వేల్పుల బద్రీనాథ్ అనే నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. తాను ఉద్యోగం ఇప్పిస్తునందుకు గాను వేల్పుల బద్రీనాథ్ దగ్గర నుండి మూడున్నర లక్షలు తీసుకున్నాడు. అయితే డబ్బులు చేతిలో పడడంతోనే సైమన్ ప్లేట్ ఫిరాయించాడు.

బద్రీనాథ్ కు రోజులు గడుస్తున్నా ఉద్యోగం రాలేదు. దీనితో విసిగిపోయిన బద్రీనాథ్ తనకి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్న సైమన్ ను ఉద్యోగం కోసం నిలదీశారు. తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బద్రీనాథ్ ఫోన్ పే అకౌంట్ కి సైమన్ 50వెలు పంపంచారు. కాగా మిగిలిన మూడు లక్షలు కూడా ఇవ్వాలని బద్రీనాథ్ అడిగారు.

కాగా బద్రీనాథ్ డబ్బులు తిరిగి ఇవ్వడం ఇష్టంలేని సైమన్ తాను వైసీపీ నాయకుడనని, డబ్బులు తిరిగి ఇచ్చే సమస్యే లేదు.. నీకు చేతనైంది చేసుకో అంటూ బెదిరింపులకు దిగారు. దీనితో ఇక చేసేదేమీలేక బద్రీనాథ్ పోలీసులను ఆశ్రయించారు. సైమన్ కు ఇచ్చిన నగదు లావాదేవీల వివరాలు పోలీసులకు అందజేసి.. తన కు న్యాయం చేయాలని బద్రీనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బద్రీనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story