జాబ్ హబ్ కాదు.. గంజాయి బౌల్‌గా మార్చేశారు

by Mahesh |
జాబ్ హబ్ కాదు.. గంజాయి బౌల్‌గా మార్చేశారు
X

దిశ, ఉత్తరాంధ్ర: డిఫెన్స్ కి.. సివిల్ కి తేడా తెలియని సి యం జగన్ రెడ్డి అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్ పోర్ట్, ఆధాని డేటా సెంటర్లకు సీఎం జగన్ మళ్ళీ శంఖుస్థాపన చేయడం సిగ్గుచేటని అన్నారు. అధికారంలోకి వచ్చిన 4 ఏళ్ల తర్వాత రాజకీయ లబ్ధి కోసం శంకు స్థాపన చేశారని అన్నారు. ప్రతిపక్షంలో జగన్ మాట్లాడిన మాటలకు అధికారంలో మాటలకు పొంతన లేదని ఎద్దేవా చేశారు. డిఫెన్స్, సివిల్ కి తేడా జగన్ కి తెలుసా అని ప్రశ్నించారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కి కనీస అవగాహన లేదనేది తెలుస్తుందని ఎద్దెవా చేశారు. ఊసరవెల్లి కూడా జగన్ లా రంగులు మార్చలేదని అన్నారు.

పెట్టుబడుల సదస్సు జరిగి రెండు నెలలు అయ్యిందని.. ఇప్పటివరకు రివ్యూ కూడ నిర్వహించలేని పరిస్థితి లో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పై శ్వేతపత్రం విడుదల చెయ్యగల ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. దానిపై చర్చకు సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తే టీడీపీ నేతల ఆస్తుల్ని ధ్వంసం చేశారన్నారు. రుషికొండ ను ధ్వంసం చేశారు.. రాష్ట్రంలో రామోజీరావు, ఆదిరెడ్డి .. వీరు మాత్రమే చిట్ ఫండ్స్ కంపెనీలు నడుపుతున్నారా అని ప్రశ్నించారు మిగతా వారు నడుపుతోంది కన్పించడం లేదా అని అన్నారు.

ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్నారు. సిట్ కు సంబంధించి మీకు అనుకూలంగా వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు.. చంద్రబాబు అరెస్ట్ అవ్వడం ఖాయమంటున్నారు.. అది మీ వల్ల కాదనేది అందరికీ తెలుసు అని గంటా అన్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి గతంలో కేటీఆర్ మెచ్చుకున్నారు.. ఇపుడు అదే విషయాన్ని రజనీకాంత్ చెప్పారు. చంద్రబాబు ని మెచ్చుకోవడం తట్టుకోలేక వైసీపీ నేతలు కుక్కల్లా మొరుగుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడిగా తయారయ్యింది.. దేశంలో ఎక్కడ దొరికినా ఏపీ మూలాలు బయటకు వస్తున్నాయి అని ఆక్షేపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం జగన్ సైకోలా తయారయ్యారని అన్నారు.

హెలికాప్టర్ లో వెళ్లే సీఎం కోసం 100 కిలోమీటర్ల రూట్ బ్లాక్ చేశారని.. రూట్ లేని ఏరియాలో రెండు రోజులపాటు దుకాణాలు మూసేయడం దారుణం అని దుయ్యబట్టారు. యువతకు ఉపాధి లేక గంజాయి రవాణా చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల సంగతి ఈ ప్రభుత్వం మర్చిపోయిందని వ్యంగ్యంగా అన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో యువత నిర్వీర్యం అయిపోయింది.. ఏపీ కాస్త గంజాయి బౌల్ గా మారి పోయిందన్నారు. యువత భవిష్యత్ పై దృష్టి పెట్టండి అని చెప్పారు ఆధాని డేటా కోసం ఔట్ రేట్ సేల్ చేసేసారు అని ఆరోపించారు. తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ టీడీపీ హయాంలో 5 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చారని మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు.

వైసీపీ హయాంలో వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. రెండు రోజుల్లో రిటైరయ్యేలా ఉద్యోగాలు ఇచ్చారు అని అన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారుర. ఎమ్మెల్సీ చిరంజీవి రావు మాట్లాడుతూ జగన్ ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చారు.. రాష్ట్రంలో నిరుద్యోగులకు నో చాన్స్ 26 లక్షల మంది నిరుద్యోగులు వున్నారని అన్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగులకు అవకాశాలు లేక బయటకు వెళ్లిపోతున్నారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ వేధింపుల వల్ల పరిశ్రమలు తరలిపోతున్నాయి అని ఆరోపించారు. ఈ కారణం వల్ల కూడా నిరుద్యోగ సమస్య బాగా పెరిగింది అని చెప్పారు స్టార్ట్ అప్ లు ప్రక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి అని ఆరోపించారు మెగా లార్జ్ ఇండస్ట్రీస్ గ్రోత్ 12 శాతంకు పడిపోయింది అని అన్నారు.

Advertisement

Next Story