- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుపతిలో భారీగా గంజాయి పట్టివేత.. ఆరుగురి అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati) ఆధ్యాత్మిక కేంద్రాన్ని కొందరు దుండగులు ఇటీవల గంజాయి(Ganjai)కి కేరాఫ్ అడ్రస్‌గా మార్చారు. తిరుపతిలో పోలీసులు ఎక్కడ తనిఖీలు(Raids) నిర్వహించినా తొలుత గంజాయి పట్టుబడుతోంది. నగరానికి గంజాయి తెప్పించి మరీ గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు జరుపుతున్నారు. దీంతో పోలీసులు నిఘా పెంచారు. గంజాయిపై ఉక్కుపాదం మోపారు. నగరంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ రోజు జరిపిన తనిఖీల్లో భారీగా గంజాయిని గుర్తించారు. విశాఖ నుంచి తీసుకొచ్చి తిరుపతితో పాటు చుట్టు ప్రాంతాల్లో అమ్మకాలు జరుపుతున్న ఇద్దరు మహిళలతో పాటు మరో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన మహిళ సహకారంతో విశాఖపట్నం(Visakhapatnam)కు చెందిన మరో మహిళ ఈ దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించి గంజాయి ముఠా గుట్టును రట్టు చేశారు. ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.