- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శ్రీవారిని దర్శించుకున్న Gali Janardhan Reddy
దిశ, తిరుపతి : గాలి జనార్దన్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక లో కొత్త పార్టీ ని ప్రారంభించానని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే ప్రచారం ప్రారంభించానన్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలు మాత్రమే సమయం ఉండడంతో.. గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లోనే అభ్యర్థులను నిలుపుతామని పేర్కొన్నారు. మరో నెల రోజుల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేసేది క్లారిటీ ఇస్తానని గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.
కాగా బీజేపీ తో విభేదించి 'కల్యాణ రాజ్య ప్రగతి పక్ష' పేరిట కొత్త పార్టీని స్థాపించిన మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి.. బళ్లారి, కొప్పళ జిల్లాల్లో అన్ని చోట్లా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. బళ్లారి సిటీ నుంచి తన సతీమణి అరుణలక్ష్మిని బరిలోకి దింపుతానని ప్రకటించారు. ఇది బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆందోళన కలిగిస్తోంది. బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి (బీజేపీ) స్వయానా గాలి జనార్దనరెడ్డి సోదరుడే. ఆయన మరోమారు అక్కడ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. హరపనహళ్లిలో మరో సోదరుడు గాలి కరుణాకరరెడ్డి, చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరులో గాలికి అత్యంత ఆప్తుడైన బి. శ్రీరాములు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో జనార్దనరెడ్డి ఎవరిని బరిలోకి దింపుతారనేది కుతూహలం రేకెత్తిస్తోంది. కాగా గాలి ప్రకటనపై స్పందించేందుకు సోమశేఖరరెడ్డి నిరాకరించారు.