వైసీపీ పాలనలో వాక్ స్వాతంత్య్రం కరువైంది: మాజీమంత్రి నారాయణ

by Seetharam |
వైసీపీ పాలనలో వాక్ స్వాతంత్య్రం కరువైంది: మాజీమంత్రి నారాయణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశాన్ని బ్రిటిష్ వారు 200 ఏళ్ళు పాలించి అపార సంపదను దోచుకెళ్లారని మాజీమంత్రి పొంగూరు నారాయణ అన్నారు. దేశాన్ని వర్గాలుగా విభజించి..వారిని రెచ్చగొట్టి.. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి.. ఎన్నో అరాచకాలు సృష్టించారని మాజీమంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఎగురవేశారు. అనంతరం మాజీమంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ...ఎందరో దేశ భక్తుల, స్వాతంత్ర సమర యోధుల ప్రాణ త్యాగాలతో స్వేచ్ఛ, స్వాతంత్య్రం సాధించుకున్నామని అన్నారు. బ్రిటీష్ పాలనలో కరువైన వాక్ స్వాతంత్ర్యం తిరిగి వైసీపీ పాలన లో కరువైందని వ్యాఖ్యానించారు. 2024లో టీడీపీ అధికారంలోకి రాబోతుందని ప్రజలు తిరిగి స్వేచ్చగా, స్వతంత్రంగా జీవించబోతున్నారని మాజీమంత్రి పొంగూరు నారాయణ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story