- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్రూప్- 1, 2 పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఇలా దరఖాస్తు చేసుకోండి!
దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1, 2 పరీక్ష రాసే అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా శుభవార్త అందించింది. కాగా డిసెంబర్ 18 వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-2కు ఈ నెల (డిసెంబరు) 22 లోపు, గ్రూప్-1 అభ్యర్థులు ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో తెలిపారు. వంద మందికి ఈ నెల 27 నుంచి 45 రోజుల పాటు గ్రూప్ -2 అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ అందజేస్తారు. గ్రూప్-1 అభ్యర్థులు ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలి. 60 మందికి జనవరి 5 నుంచి 60 రోజుల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ అందజేస్తారు. డిగ్రీ లో వచ్చిన మార్కులు, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. బయోడేటాతో పాటు 10th, ఇంటర్, డిగ్రీ మార్కుల లిస్టులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (తల్లిదండ్రులకు రూ.లక్ష లోపు వార్షిక ఆదాయం ఉండాలి), ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు జతపరచాలి. అనంతపురం పెన్నార్ భవన్ పక్కన ఉన్న బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో అభ్యర్థులు దరఖాస్తులు అందజేయాలి.