NTR వెన్నుపోటుకు గురవ్వడానికి అదే కారణం: వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2022-12-24 14:34:18.0  )
NTR వెన్నుపోటుకు గురవ్వడానికి అదే కారణం: వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దివంగత సీఎం, ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చుట్టూ జరిగిన కుట్రలు, కుతంత్రాలను ఎన్టీఆర్ గమనించలేకపోయారని వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఆయన భోళా మనిషి అని.. అందుకే ఎన్టీఆర్ వెన్నుపోటు గురయ్యారని షాకింగ్ కామెంట్స్ చేశారు. పేదల సంక్షేమం కోసం ఆయన ఎంతో పాటుపడ్డాడని.. పేద ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను ఎన్టీఆర్ తీసుకువచ్చారని కొనియాడారు. అంతేకాకుండా రాజకీయాల్లో ఎన్టీఆర్ సైలెంట్ విప్లవాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. కాగా, ఎన్టీఆర్ వెన్నుపోటుపై వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Advertisement

Next Story