గత్యంతరం లేక టీడీపీలో చేరా.. కంటతడి పెట్టిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల

by srinivas |
గత్యంతరం లేక టీడీపీలో చేరా.. కంటతడి పెట్టిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి టీడీపీ తరపున కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ టికెట్ దక్కిన విషయం తెలిసిందే. అయితే ఆయన గతంలో కర్నూలు పార్లమెంట్‌లో పోటీ చేశారు. ఈసారి మాత్రం అసెంబ్లీలో బరిలో దిగుతున్నారు. దీంతో ఆయన మనస్థాపం చెందారు. ఇష్టంలేకపోయినా తాను డోన్ అసెంబ్లీలో పోటీ చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. కర్నూలు పార్లమెంట్ వదిలి వెళ్లడంపై భావోద్వేగానికి గురయ్యారు. ప్రసంగం మధ్యలోనే ఆపేసి కూర్చున్నారు. గత్యంతరం లేక కాంగ్రెస్‌ను వదిలి టీడీపీలో చేరామని వ్యాఖ్యానించారు. ఎప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే ఉండిపోతామని చెప్పారు. ఇష్టం లేకుండానే తాను డోన్ పోటీ చేస్తున్నానని కేంద్రమాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తెలిపారు.

కాగా కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి చాలా కాంగ్రెస్‌లో పని చేశారు. ఆయన తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా రెండు సార్లు సేవ చేశారు. అంతకుముందు మంత్రిగా, కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి వారసత్వంగా విజయ భాస్కర్ రెడ్డి కుమారుడు జయ సూర్య ప్రకాశ్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. కర్నూలు లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసి రైల్వే శాక సహాయ మంత్రిగా పని చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో డోన్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నూలులో బహిరంగ సభ నిర్వహించారు.

Advertisement

Next Story