మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ రద్దు

by M.Rajitha |   ( Updated:2024-10-14 14:36:02.0  )
మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ రద్దు
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ కొట్టివేసింది కోర్ట్. వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్య కేసులో సురేష్ నిందితుడిగా ఉన్నాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులోనూ నిందితునిగా ఉన్నాడు. తనకు బెయిల్ మంజూరు చేయమని గుంటూరు జిల్లా కోర్టులో నందిగం సురేష్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్ట్ కొట్టివేసింది. కాగా చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో సురేష్ ను పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి, గుంటూరుకు తరలించారు. ఈ కేసులో కోర్ట్ రిమాండ్ విధించడంతో ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed