టీడీపీ, జనసేన లిస్ట్: జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-02-25 16:26:16.0  )
టీడీపీ, జనసేన లిస్ట్: జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ తొలి జాబితా చూసి వైసీపీ నాయకులకు భయం పట్టుకుందని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు చాలా జాగ్రత్తలు పాటించారని ఆయన తెలిపారు. అత్యంత ఆప్తులకు కూడా సీట్లు కేటాయించలేకపోయారని తెలిపారు. తన కుటుంబానికి ఒకే టికెట్ అని చంద్రబాబు చెప్పలేదన్నారు. టికెట్లు రాని వారికి సహజంగానే అసంతృప్తి ఉంటుందన్నారు. సీఎం జగన్‌ రాక్షస పాలనను అంతమొందించేందుకే టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఎన్నో సర్వేలు చేసి చంద్రబాబు టికెట్లు కేటాయించారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని, చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారని జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు.

సీఎం జగన్ సభలకు జనాలు పోటెత్తడంపై జేసీ దివాకర్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆయన సభలకు వచ్చే వాళ్లంతా ఇతర జిల్లాల వాళ్లు అని ఎద్దేవా చేశారు. ఈ రోజుల్లో సభలకు జనాలు వస్తున్నారంటే నాయకులు మందు, చికెన్, డబ్బులు బాగా పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నారు కాబట్టి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Read More..

Breaking: టీడీపీ ఎమ్మెల్యే వెలపూడికి బెదిరింపు కాల్స్

Advertisement

Next Story