మీడియాపై చింతమనేని రుసరుసలు.. కెమెరాలు బద్దలు కొట్టాలంటూ హుకుం

by Seetharam |
మీడియాపై చింతమనేని రుసరుసలు.. కెమెరాలు బద్దలు కొట్టాలంటూ హుకుం
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీడియాపై చిందులేశారు. కెమెరా లాక్కుని బద్దలుకొట్టండంటూ రుసరుసలాడారు. అంతేకాదు మీడియాపై తన కార్యకర్తలను ఉసుగొలిపడం చర్చనీయాంశంగా మారింది. ఏలూరు జిల్లా‌‌ టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న దెందులూరు టీడీపీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి కొంతమంది నాయకులు, కార్యకర్తలు హాజరు కాకపోవడంతో చింతమనేని ప్రభాకర్ అసహనానికి గురయ్యారు. సమావేశానికి డుమ్మా కొట్టిన నాయకులను, కార్యకర్తలను బహిరంగంగా బూతులు తిట్టారు. ఈ బూతులను ఓ మీడియా కెమెరామెన్ చిత్రీకరించారు. ఈ విషయాన్ని గమనించిన చింతమనేని ప్రభాకర్ ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడ ఉన్న కార్యకర్తలను ఉసుగొలిపి కెమెరా లాక్కుని బద్దలుకొట్టండి అని ఉసిగొల్పారు. దీంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

Advertisement

Next Story