HYD: వైఎస్ వివేకా హత్య కేసు విచారణ వాయిదా

by srinivas |   ( Updated:2023-06-16 10:49:19.0  )
HYD: వైఎస్ వివేకా హత్య కేసు విచారణ వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు విచారణ ఈనెల 30కు వాయిదా పడింది. నాంపల్లి ప్రత్యేక కోర్టులో శుక్రవారం వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జరిగింది. ఇందులో భాగంగా ఆరుగురు నిందితులను కోర్టులో సీబీఐ హాజరుపర్చింది. ఈ ఆరుగురు నిందితుల్లో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. ఇరువాదనలు విన్న ధర్మాసనం ఆరుగురు నిందితుల రిమాండ్‌ను ఈ నెల 30 వరకు పొడిగించింది. తదుపరి విచారణను కూడా ఈ నెల 30కు వాయిదా వేసింది. అనంతరం నిందితులను అధికారులు తిరిగి చంచల్ ‌గూడ జైలుకు తరలించారు.

Advertisement

Next Story