బస్సు డ్రైవర్‌గా మారిన మాజీ మంత్రి! ఎందుకంటే?

by Ramesh N |   ( Updated:2024-02-03 10:21:46.0  )
బస్సు డ్రైవర్‌గా మారిన మాజీ మంత్రి! ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: బస్సు నడుపుతున్న మాజీ మంత్రి వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపేదిశగా ప్రధాన పార్టీలు ప్రచారాలు మమ్మరం చేశాయి. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైసీపీ చీఫ్, సీఎం జగన్ సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి వేదికగా ఎన్నికల సమరానికి శంఖం పూరించారు. ఈ క్రమంలోనే శనివారం ఏలూరులో ‘సిద్ధం’ పేరుతో రెండో సభ నిర్వహిస్తున్నారు.

ఏలూరు సభలో భాగంగా మాజీ మంత్రి కృష్ణాజిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు పేర్ని నాని బస్సు నడిపారు. స్వయంగా మచిలీపట్నం నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న పేర్ని కిట్టు బస్సులో సభకు బయల్దేరారు. దీంతో వారికి బస్సు డ్రైవర్‌గా ఈ మాజీ మంత్రి మారారు. శ్రేణులతో కలిసి ఏలూరు సిద్ధం సభకు జనాన్ని తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సీఎం జగన్ చివరికి బస్సు డ్రైవర్ జాబ్ ఇచ్చారా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story