TDP: వైఎస్ జగన్... నారా లోకేశ్ మధ్య తేడా ఇదే..

by srinivas |   ( Updated:2023-06-24 15:59:26.0  )
TDP: వైఎస్ జగన్... నారా లోకేశ్ మధ్య తేడా ఇదే..
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాద్రయాత్రకు, ఇప్పటి నారా లోకేశ్ యువగళానికి మధ్య ఉన్న తేడా ఏంటో స్పష్టం చేశారు. వైఎస్ జగన్ వారానికి 40 కిలో మీటర్లు పాదయాత్ర చేస్తే.. అదే నారా లోకేశ్ 100 కిలో మీటర్ల మేర నడుస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు.

ఇక సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను నాశనం చేశారని సోమిరెడ్డి మండిపడ్డారు. ముఖ్యంగా నీటి పారుదల శాఖను నిర్వీర్యం చేశారని, ఆ శాఖలో ఖర్చు చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఉండే తాడేపల్లి ప్యాలెస్‌పైనా విమర్శలు చేశారు. అది అవినీతికి అడ్డగా మారిందని, లంచం ఇస్తే గాని కాంట్రాక్టర్లకు బిల్లులు రావట్లేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు.

Advertisement

Next Story