‘సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉంటాం’.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉంటాం’.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా(Former minister Roja) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా(Social Media)లో ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోస్టులు పెడుతూనే ఉంటామని మాజీ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని ఆమె నిలదీశారు. ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలోని యువత, మహిళలు, రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహిళలకు రూ.1,500, విద్యార్థులకు రూ.15 వేలు, రైతులకు రూ.20 వేలు, యువతకు రూ.3 వేలు ఎగ్గొట్టారని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం(Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతాం అని ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Advertisement

Next Story