AP News:హోంమంత్రి అనిత పై మాజీ మంత్రి రోజా ఫైర్.. కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |
AP News:హోంమంత్రి అనిత పై మాజీ మంత్రి రోజా ఫైర్.. కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస దాడుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీలో జరుగుతున్న అఘాయిత్యాల(Atrocities)పై మాజీ మంత్రి రోజా(Former minister Roja) స్పందించారు. రాష్ట్రంలో రోజురోజుకు బాలికలపై లైంగిక దాడి ఘటనలు పెరిగిపోతున్నాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రోజా హెం మంత్రి అనిత(Home Minister Anitha) పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

ఇటీవల తిరుపతి జిల్లాలో పదో తరగతి బాలికపై జరిగిన లైంగిక దాడి(sexual assault) విషయం పై రోజా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గౌరవ హోంమంత్రి అనిత గారు మరియు ఎస్పీ గారు.. ఒక్కసారి మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఆత్మపరిశీలన చేసుకోండి. ఆ ఆడబిడ్డ తండ్రి తన బిడ్డకి జరిగిన అన్యాయానికి దోషులను ఉరి తీయాలని, తన బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంటుంటే.. ఆ తండ్రి ఆవేదన మీకు కనిపించడం లేదా? ఆ తండ్రి బాధ మీకు కనిపించలేదా? ఎవరి మెప్పు కోసం ఈ దాపరికాలు? వాస్తవాలను దాచి కేసును పక్కదారి పట్టిస్తున్నందుకు సిగ్గు పడండి’’ అంటూ మాజీ మంత్రి రోజా మండిపడ్డారు.

Advertisement

Next Story