మరో ఏడాదిలో తెలిసిపోతుంది..పవన్ కల్యాణ్‌పై పేర్ని నాని సెటైర్లు

by srinivas |
మరో ఏడాదిలో తెలిసిపోతుంది..పవన్ కల్యాణ్‌పై పేర్ని నాని సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీ దినోత్సవ వేడుకలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌లా చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఏడాది తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ వచ్చారని వ్యంగ్యంగా విమర్శించారు. ప్రజల కోసం అన్ని త్యాగం చేసిన పవన్‌కు మళ్లీ సినిమాలేంటని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు మారాలని.. ఎవరి కోసం మారాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు బాగుపడాలనేదే చంద్రబాబు లక్ష్యమన్నారు. కాపులు, బలిజలు వేరు అని పవన్‌కు ఎవరు అని చెప్పారని పేర్ని నాని ప్రశ్నించారు.

రాంమనోహర్ లోహియ బీసీల గురించి ఎప్పుడు పుస్తకం రాశారని, పవన్ ఎప్పుడు చదివారోనని ఎద్దేవా చేశారు. ప్రజానాయకుడికి, రాజకీయ నేతకు ఏ కులం అయితే ఏంటి అని ప్రశ్నించారు. ఒక్క కులం ఓట్లతో చట్ట సభలకు వెళ్లాలని కోరుకుంటారా అని నిలదీశారు. మరో ఏడాదిలో రంగులు బయట పడతాయని పేర్ని నాని జోస్యం చెప్పారు.

Advertisement

Next Story