- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్పీడ్‌గా వెళ్తే సైకిల్ చక్రాలు ఊడిపోతాయ్: చంద్రబాబుకు పేర్ని నాని కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో టీడీపీ ఇవాళ నిర్వహించిన మహానాడులో ఏపీ సర్కార్‌పై మాజీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. దీంతో టీడీపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. మహానాడులో చంద్రబాబు అన్ని డబ్బా కబుర్లు చెప్పారని ఎద్దేవా చేశారు.
అసలు మహానాడు అంటే ఎన్టీఆర్ నిర్వహించేవారని.. చంద్రబాబు ఇవాళ నిర్వహించిన మహానాడు కేవలం చందాలు, భోజనాల కోసమేనని సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ దూసుకుపోతుందన్న చంద్రబాబు వ్యాఖ్యలకు.. స్పీడ్‌గా వెళ్తే సైకిల్ చక్రాలు ఊడిపోతాయని కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కేవలం ఎన్టీఆర్, వైఎస్ జగన్ శకాలు మాత్రమే ఉంటాయని.. చరిత్రలో చంద్రబాబు శకం ఉండదన్నారు.
Also Read..
అచ్చెన్నా తెగబలిసి మాట్లాడొద్దు.. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్