త్వరలో జనసేనలో చేరుతా.. మాజీ మంత్రి సంచలన ప్రకటన

by GSrikanth |   ( Updated:2024-02-22 10:42:13.0  )
త్వరలో జనసేనలో చేరుతా.. మాజీ మంత్రి సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఏపీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార వైసీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఆయన ఇంటివద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీకి రాజీనామా చేసి.. జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.


ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్ అని కొనియాడారు. గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు ఆయన ఫాలోయింగ్ ఉందని అన్నారు. యువతకు ఆరాధ్య నాయకుడని తెలిపారు. ఆయన సొంత సొమ్ము వెచ్చించి కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందిచారన్నారు. రాజధాని అమరావతి విషయంలో ఆయన పోరాటం ఎనలేనిదన్నారు. రైల్వే జోన్‌, ప్రత్యేక హౌదా విషయంలో నిర్మొహమాటంగా పోరాటం చేశారన్నారు.

Read More..

ఏపీలో దొంగ ఓట్లు.. ఆందోళన వ్యక్తం చేసిన బీజేపీ చీఫ్

Advertisement

Next Story