- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అది ప్రభుత్వ ఇష్టం: రుషికొండ భవనాలపై మాజీ మంత్రి గుడివాడ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: విశాఖ రుషికొండ భవనాల(Visakha Rushikonda Buildings)పై సీఎం చంద్రబాబు(CM Chandrababu) చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఖండించారు. రుషికొండ భవనాలను ఎలా వినియోగిస్తారో ప్రభుత్వం ఇష్టమని ఆయన తెలిపారు. టూరిజం కోసమే ఆ భవనాలను నిర్మించామని గుడివాడ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం నిర్మించినవే ఆ భవనాలని చెప్పారు. రుషికొండ భవనాలను వైఎస్ జగన్ అద్భుతంగా నిర్మించారని తెలిపారు. ఆ భవనాలు జగన్ ఇల్లు కాదని తెలిపారు. జగన్ ఆస్తుల్లా మాట్లాడటం సరికాదన్నారు. అలాంటి భవనాలను ఎప్పుడూ కట్టలేకపోయారనే బాధ చంద్రబాబులో ఉందని ఎద్దేవా చేశారు. తాత్కాలిక భవనాల్లో వర్షపు నీరు వచ్చిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. సచివాలయం నిర్మాణంలో చంద్రబాబు ఎన్ని డబ్బులు దోచుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాలనలో కూటమి సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతోందని ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ హామీల అమలును మర్చిపోయారని మాజీ మంత్రి గుడివాడ విమర్శించారు.