- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒక్కసారి జగన్‌ను కలిసే ఛాన్స్ ఇప్పించండి: డొక్కా మాణిక్య వరప్రసాద్
దిశ, వెబ్ డెస్క్: వైసీపీలో మార్పులు, చేర్పులపై మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అడగకుండానే సీఎం జగన్ గతంలో తాడికొండ ఇంచార్జిగా నియమించారని.. ఇప్పుడు పక్కన పెట్టేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పెద్దలు ఒక్కసారి జగన్‌ను కలిసేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. పత్తిపాడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 2019లో సుచరిత చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు అదే సుచరితను తాడికొండ ఇంచార్జిగా జగన్ నియమించారు. అయితే డొక్కా మాణిక్య వర ప్రసాద్ గురించి మాత్రం ప్రస్తవన లేదు. దీంతో ఆయన ఆయోమయంలో పడ్డారు. అప్పుడు సర్వేలు బాగుండటంతో తనను తాడికొండ సమన్వయకర్తగా నిర్వహించారని, ఇప్పుడు అప్పటి పరిస్థితులు లేకపోవడంతో తనను సీఎం జగన్ పక్కన బెట్టారని ఆరోపించారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై అడిగే దమ్మూ, ధైర్యం వైసీపీలో ఎవరికీ లేవన్నారు. అయినా తనకు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశ లేదని, కానీ ఒక్కసారి జగన్‌ను చూడాలని ఉందని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.