'దమ్ముంటే 12 గంటలకు NTR సర్కిల్‌కు రా'.. ఎమ్మెల్యే సవాల్ స్వీకరిస్తాడా?

by GSrikanth |
దమ్ముంటే 12 గంటలకు NTR సర్కిల్‌కు రా.. ఎమ్మెల్యే సవాల్ స్వీకరిస్తాడా?
X

దిశ, వెబ్‌డెస్క్: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మాజీ మంత్రి బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. 'దమ్ముంటే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఎన్టీఆర్ సర్కిల్‌కు రావాలి. మీరో మేమో తేల్చుకుందాం. ఎవరూ లేనప్పుడు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం కాదు' అని బుద్ధా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సవాల్‌ను వంశీ స్వీకరిస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేశారంటూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు పట్టుబట్టడం ఈ ఘర్షణలకు కారణమైంది. వంశీ ప్రోద్బలంతోనే తమ కార్యాలయంపై దాడులు చేయడం కాకుండా అక్కడ నిలిపి ఉంచిన వాహనాలను తగులబెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story