మా అబ్బాయి క్యారెక్టర్‌ను దెబ్బ తీశారు.. బాలినేని తీవ్ర ఆగ్రహం

by srinivas |   ( Updated:2024-07-15 14:15:43.0  )
మా అబ్బాయి క్యారెక్టర్‌ను దెబ్బ తీశారు.. బాలినేని తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: తమ కుమారుడి కేరక్టర్‌ను దెబ్బ తీశారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో భూ కబ్జాలపై టీడీపీ, జనసేన నాయకులు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. తాను ఊరు విడిచి వెళ్లిపోయామని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను, తమ కుమారుడిపై చేస్తున్న ఆరోపణలు వాస్తవంకాదన్నారు. టీడీపీ నాయకులు చేసిన భూ కబ్బాలపై తాము అధికారంలో ఉండగా ఒక్క మాట మాట్లాడలేదని గుర్తు చేశారు. తమపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. తనపై అవినీతిని నిరూపిస్తే ఉరేసుకుంటానని బాలినేని పేర్కొన్నారు.

తాను రాజకీయాలకు స్వస్తి పలుకుదామని అనుకుంటున్న సమయంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బాలినేని మండిపడ్డారు. తాను జనసేనలో చేరేది లేదని, ఒంగోలు నుంచే రాజకీయాలు చేస్తానని చెప్పారు. తాము అధికారంలో ఉండగా ఎవరిపైనా దాడులు చేయలేదని తెలిపారు. ఎన్నికల తర్వాత వైసీపీ శ్రేణులు, కార్యకర్తలపై దాడులు పెరిగాయన్నారు. తమ కుమారుడు మురళిపై దాడి చేసినా పోలీసులు కేసులు నమోదు చేయలేదని బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.

Advertisement

Next Story