పార్టీ పెద్దలు బుజ్జగించినా వెనక్కి తగ్గని బాలినేని.. సీఎం ఆఫీసు నుంచి పిలుపు

by Seetharam |   ( Updated:2023-06-01 05:48:11.0  )
పార్టీ పెద్దలు బుజ్జగించినా వెనక్కి తగ్గని బాలినేని.. సీఎం ఆఫీసు నుంచి పిలుపు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్‎తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ భేటీ కానున్నారు. నెల రోజుల క్రితం సీఎం జగన్, ఆయన సమావేశమై పలు విషయాలపై చర్చించిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లనున్న బాలినేని సాయంత్రం 3 గంటలకు మరోసారి జగన్‎తో సమావేశం కానున్నారు. ఇటీవల జిల్లాలో పరిస్థితులపై బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. పార్టీ పెద్దలు బుజ్జగించినా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు సీఎం నుంచి పిలుపు రావడంతో పలు విషయాలపై చర్చించనున్నారు. మార్గాపురం సీఎం పర్యటనలోనూ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ రోజు భేటిలో ప్రకాశం, బాపట్లలో వైసీపీ పరిస్థితులపై చర్చించే అవకాశాలున్నాయని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story