- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘APలో విధ్వంసం స్టార్ట్’.. చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి తీవ్ర విమర్శలు
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసం మొదలైందని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 15 రోజులు కాకుండానే రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాలు, పార్టీ నేతలపై దాడులు చేస్తు్న్నారని ఫైర్ అయ్యారు. బీహార్ గుండాల నాగరికతను ఏపీలో అమలు చేస్తున్నారని అన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మా ఆఫీసులు కూలుస్తున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు గతంలో ఇచ్చిన జీవో ప్రకారమే వైసీపీ ఆఫీసులు నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి వదిలి.. చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేతలు మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన సూపర్-6 హామీలు ఏమయ్యాని ప్రశ్నించారు. కాగా, తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో వైసీపీ కార్యాలయాన్ని అధికారులు నేలమట్టం చేశారు. వైసీపీ కార్యాలయాన్ని కూల్చి వేడయంపై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. చంద్రబాబు సర్కార్‌పై విమర్శల వర్షం కురుపిస్తున్నారు.