Ambati Rambabu: తీరా చూస్తే అది తప్పు అని తేలింది

by Gantepaka Srikanth |
Ambati Rambabu: తీరా చూస్తే అది తప్పు అని తేలింది
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిలకడ ఉండదని.. అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల గ్రాంట్ వచ్చిందంటున్నారు.. తీరా చూస్తే అది తప్పు అని తేలిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నారని విమర్శించారు. భూముల సర్వేపై చంద్రబాబుకు కనీస పరిజ్ఞానం లేదని ఎద్దేవా చేశారు. బ్రిటీష్‌ కాలం నుంచి భూముల సర్వే జరగలేదని.. అందుకే భూ సమస్యలు ఉండకూదని కేంద్రం భూసర్వే చేయిస్తోందని చెప్పారు. హక్కుదారులకే భూమి ఉండాలని తమ ప్రభుత్వం భావించిందన్నారు. 14,630 మంది సర్వేయర్లతో సర్వే చేయించామని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తాము బెదరబోమని అన్నారు. గతంలో వైసీపీపై అనేక కుట్రలు చేసినా జగన్‌ తట్టుకొని గెలిచారని గుర్తుచేశారు. తమ పార్టీపై ఎన్ని కుట్రలు చేసినా బెదిరేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story