పేరు మారినా ముద్రగడ ముద్రగడే: మాజీ మంత్రి అంబటి

by srinivas |   ( Updated:2024-07-17 14:51:34.0  )
పేరు మారినా ముద్రగడ ముద్రగడే: మాజీ మంత్రి అంబటి
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించకపోతే తాను పేర్చుమార్చుకుంటానంటూ ఎన్నికలకు ముందు కాపు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో పాటు పోటీ చేసిన అన్ని చోట్ల విజయం కేతనం ఎగురవేయడంతో సవాల్ చేసిన ప్రకారం ముద్రగడ్ పద్మనాభం పేరు మార్చుకున్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుని అధికారిక కార్యక్రమాలన్ని ముగించారు. దాంతో ఆయన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారింది. అయితే ఆ తర్వాత ముడ్రగడ సైలెంట్ అయ్యారు.

తాజాగా ముడ్రగడను మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ ముద్రగడ పేరు మార్చుకున్నారని తెలిసి అభినందించానని చెప్పారు. చేసిన సవాల్‌కు కట్టుబడి ముద్రగడ పేరు మార్చుకున్నారని తెలిపారు. పేరు మారినా ముద్రగడ ముద్రగడేనని అంబటి పేర్కొన్నారు. రాజకీయాల్లో నష్టపోయిన వ్యక్తి ముద్రగడ అని, కులాన్ని ఎప్పుడూ ఉపయోగించుకోలేదని తెలిపారు. ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీలో పని చేశారని.. ఆ సమయంలో కాపు సమావేశం జరుగుతోందని.. ఆ పార్టీకి రాజీనామా చేసి ఆయన మీటింగ్ వచ్చారని అంబటి గుర్తు చేశారు.

Advertisement

Next Story