- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లడ్డూ వివాదం.. సిట్ దర్యాప్తుపై మాజీ మంత్రి అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వివాదం (Tirumala Laddu Controversy)ఘటనపై సిట్ అధికారులు (SIT Officials)దర్యాప్తును ముమ్మరం చేశారు. తిరుమలలో విచారణ చేపట్టారు. ఈవోను కలిసి కేసుపై సుధీర్ఘంగా చర్చించారు. అయితే సిట్ దర్యాప్తుపై మాజీ మంత్రి అమర్‌నాథ్ (Former minister AmarNath) సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ సభ్యుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని తెలిపారు. రాష్ట్రంలో సినిమా పోలీసింగ్ నడుస్తోందని ఆరోపించారు. లడ్డూ అంశంపై సీబీఐ (CBI) లేదా సుప్రీంకోర్టు (Supreme Court) జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతనుపై ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో ఎక్సైజ్ షాపుల కేటాయింపు చూస్తే అర్ధమవుతోందని ఎద్దేవా చేశారు. లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబు మత రాజకీయాలు చేస్తూ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ప్రైవేటీకరణను టీడీపీ (TDP)నే అడ్డుకోవాలని, కూటమి నుంచి తప్పుకోవాలని అమర్‌నాథ్ డిమాండ్ చేశారు.