- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త మద్యం పాలసీపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చి రాగానే ఉచిత ఇసుక, కొత్త మద్యం పాలసీ కి శ్రీకారం చుట్టింది. కాగా ఈ రోజు కొత్త మద్యం పాలసీలో భాగంగా.. ప్రైవేట్ యజమానులకు సంబంధించి వచ్చిన ధరకాస్తులపై డ్రా పద్దతిలో మొత్తం 3,396 షాపులకు సంబంధించిన నూతన లైసెన్సుల ప్రక్రియను పూర్తి చేశారు. ఈ నెల 16 నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభించుకోవచ్చు అని మంత్రి కొల్లు రవింద్ర ప్రకటించారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొత్త మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఏడు అంశాలతో కూడిన ట్వీట్ చేశారు. అందులో గత ప్రభుత్వం నుంచి అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, వాటిని ప్రయివేటు పేరుతో టీడీపీ నేతలకు అందించారన్నారు.
చంద్రబాబు తెచ్చిన లిక్కర్ పాలసీ గొప్పది అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు బెదిరింపులకు దిగుతారని, నీకింత, నాకింత అంటే కమిషన్లు వేసుకుంటున్నారని, ఆరోపించారు. అలాగే కొత్త మద్యం పాలసీ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రానీయకుండా.. గండికొడుతున్నారన్నారు. ప్రభుత్వం మద్యం అమ్మితే నియంత్రణ ఉంటుందని, ప్రైవేట్ పరం చేస్తే అడ్డు అదుపు లేకుండా అమ్మకాలు చేస్తారని.. ఇందులో టీడీపీ సొంత లాభం ఉందని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 15 వేల మంది ఒక్కసారిగా నిరుద్యోగులై రోడ్డున పడ్డారన్నారు. సీఎం చంద్రబాబు అక్రమార్జన కోసం ఆయన కార్యకర్తలకు అవినీతి డబ్బు సంపాదించుకోవడం కోసం ఈ కొత్త లిక్కర్ పాలసీని అమలు చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు ప్రమాదకరం అంటూ మాజీ సీఎం జగన్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.