- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చంద్రబాబు ఇంటిని కాపాడేందుకే.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: మానవ తప్పిదం వల్లే విజయవాడకు వరదలు వచ్చాయని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వరద ప్రభావితానికి గురైన విజయవాడ సింగ్‌నగర్‌లో ఆయన పర్యటించారు. వరద ప్రాంతాలను పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. వరద సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్షాలపై వాతావరణ శాఖ ఆగస్టు 28నే హెచ్చరించిందని, వరదలపై ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. ప్రజలను అప్రమత్తం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో ప్రభుత్వం స్పందించి ఉంటే ఇంత ముంపు ఉండేదికాదన్నారు. చంద్రబాబు ఇంటిని కాపాడేందుకు విజయవాడను ముంచేశారన్నారు. విజయవాడ ప్రజలకు ఈ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లక్షమంది నిర్మాసితులకు ఏర్పాటు చేసిన క్యాంపులు సరిపోవన్నారు. తక్షణమే మరికొన్నింటిని ఏర్పాటు చేయాలని సూచించారు. వరద బాధితులకు వెంటనే ఆర్థిక సాయం అందజేయాలని జగన్ డిమాండ్ చేశారు.