ఇప్పుడు మన ముందున్న ఏకైక మార్గం అదే.. మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
ఇప్పుడు మన ముందున్న ఏకైక మార్గం అదే.. మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తోన్న దుర్మార్గాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో న్యాయం, ధర్మం, ఎక్కడా కనిపించడం లేదని ఆవేదన చెందారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రతి వైసీపీ కార్యకర్తకు మీ అవసరం ఉంది. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేస్తాం.

కార్యకర్తలకు అండగా, తోడుగా నిలబడండి. మనం అందరం ఏకతాటిపైకి వచ్చి యుద్ధం చేస్తేనే టీడీపీ అరాచకాన్ని ప్రజలకు చూపగలం. ఇప్పుడు మన ముందున్న ఏకైక మార్గం అదొక్కటే’ అని వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులకు జగన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసుల ఎదుటే అక్రమాలు జరుగుతున్నాయని ఆవేదన చెందారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాయర్ల అవసరం పార్టీకి చాలా ఉంది. పార్టీ కేడర్‌ను కాపాడుకోవడంలో అందరం ఒకతాటి మీదకు వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. టీడీపీ చేసే అరాచకాలను కోర్టుల దృష్టికి తీసుకెళ్లాలి. జిల్లాల్లో లీగల్ సెల్ ఇంకా పటిష్టం కావాలని జగన్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story