AP:నేడు మరోసారి బెంగళూరుకు మాజీ సీఎం జగన్..కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |
AP:నేడు మరోసారి బెంగళూరుకు మాజీ సీఎం జగన్..కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (శుక్రవారం) నంద్యాల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి పర్యటన ముగిసిన తర్వాత ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లనున్నారని తెలుస్తోంది. విశాఖలో ఈ నెల 30వ తేదీన జరుగబోతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో విశాఖ జిల్లాలో వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కొందరిని బెంగళూరులో క్యాంపునకు తరలించిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ ఎందుకు బెంగళూరు వెళ్తున్నారనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఇదివరకు రెండు సార్లు జగన్ బెంగళూరు వెళ్లి రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు నాలుగు రోజుల పాటు అక్కడే బస చేయవచ్చునని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్ పదేపదే బెంగళూరు వెళ్లడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story