AP News:అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ డుమ్మా ..కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |
AP News:అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ డుమ్మా ..కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. దీంతో వైసీపీ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో అసహనం నెలకొంది. దీంతో వైఎస్ జగన్ ఇప్పటికే పార్టీ కార్యకర్తలను పరామర్శించిన సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో ఏపీలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? అనే విషయం పై రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరు కాకపోవచ్చన్న ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నాయి. నేడు( సోమవారం) వైఎస్ జగన్ బెంగళూరుకు వెళ్లడమే దీనికి ప్రధాన కారణం అంటున్నారు. ఈ పర్యటన కోసమే ఆయన ప్రజాదర్బార్‌ను సైతం వాయిదా వేసుకోవడం గమనార్హం. ఈ నెలఖారు వరకు అక్కడే ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై పార్టీ వర్గాలు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed