- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు కోసం భార్య భువనేశ్వరి మరో సంచలన నిర్ణయం
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు కోసం భార్య భువనేశ్వరి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆమె మరికొన్ని రోజులు జనాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. భర్త చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ కోసం మే 1 నుంచి 3వ తేదీ వరకూ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. ఇప్పుడు కూడా ఆమె నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నానే ఉన్నారు. తాజాగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మే1న కడప, 2న పాణ్యం, 3న దర్శిలో భువనేశ్వరి పర్యటించనున్నారు. మే1న కమలాపురంలో భేటీ కానున్నారు. వారి సమస్యలు తెలుసుకుని భరోసా ఇవ్వనున్నారు.
ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. దీంతో కూటమి అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. మరోవైపు ఎన్నిలకు సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు బాలకృష్ణ కూడా కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఇక చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మహిళలను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అటు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కూడా తన భర్త విశాఖ పట్నం లోక్‌సభ అభ్యర్థి భరత్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బాలయ్య తరపున ఆయన భార్య వసుంధర కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇలా నారా, నందమూరి ఫ్యామిలీ మెంబర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
Read More : రాష్ట్రవ్యాప్తంగా నారా లోకేశ్ సుడిగాలి పర్యటన.. షెడ్యూల్ ఇదే..