- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్: సీఐడీ కస్టడీకి చంద్రబాబు.. ఒక్కరోజే మూడు వరుస ఎదురుదెబ్బలు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టులో పీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. కాగా, ఈ పిటిషన్‌పై ఇదివరకే ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. అనంతరం కస్టడీ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలువరించింది. చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగించింది. సీఐడీ ఐదు రోజులు కస్టడీకి కోరగా.. కోర్టు మాత్రం రెండు రోజులకే పర్మిషన్ ఇచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.
కాగా, చంద్రబాబుకు ఇవాళ న్యాయస్థానాల్లో వరుసగా షాకులు తగిలాయి. చంద్రబాబు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇవాళ్టితో ముగిసినప్పటికీ.. రిమాండ్‌ను న్యాయస్థానం మరో రెండు రోజులు పొడగించింది. ఇదిలా ఉండగానే ఈ కేసులో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, రిమాండ్‌ను కొట్టేయాలని చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను సైతం న్యాయస్థానం కొట్టేసింది. కస్టడీ పిటిషన్‌లోనూ చంద్రబాబుకు నిరాశే ఎదురయ్యింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు సీనియర్ లాయర్లతో చర్చలు జరుపుతున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.