నాలుగేళ్లుగా కేశినేని సొంత అజెండాతో ముందుకెళ్తున్నారు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Shiva |
నాలుగేళ్లుగా కేశినేని సొంత అజెండాతో ముందుకెళ్తున్నారు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : గత నాలుగేళ్లుగా ఎంపీ కేశినేని నాని తన సొంత అజెండాతో ముందుకెళ్తూ పార్టీ పట్ల అగౌరవంగా ప్రవర్తించారిన మాజీ మంత్రి కొండ్రు మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన విశాఖలో మాట్లాడుతూ.. రాజకీయ జన్మనిచ్చి, రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన పార్టీని, అధినేతపై అనుచిత వ్యాఖ్యలకు కేశినేని దిగడం దారుణమని అన్నారు. ఆయన ఏం చేసినా.. పట్టించుకోని చంద్రబాబు క్షమిస్తూ.. పార్టీలో ఉంచనిచ్చారని ఆరోపించారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో నాని ఏమయ్యాడని ప్రశ్నించారు. పార్టీ తరపున ఏనాడు నాని బాధ్యతగా వ్యవహరించలేదని అన్నారు. వైసీపీ నేతలతో కుమ్మక్కై కేశినేని నాని అన్ని పరిణామాలను విజయవాడ ప్రజానీకం గమనిస్తూనే ఉన్నారని మురళి అన్నారు.

Advertisement

Next Story