- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమూల్ పై కాదు పాడి రైతుల పై శ్రద్ధ వహించండి: అచ్చెన్నాయుడు
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పాడి రైతులకు ఇచ్చిన హామీల అమలును మరచి గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థకు ప్రమోటర్‌గా ప్రభుత్వం వ్యవహరించడం పై సీఎం జగన్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. పాడి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై మండిపడ్డారు. పాలు లీటర్‌కు రూ. 4 బోనస్ ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అమూల్ పై చూపిస్తున్న శ్రద్ధ పాడి రైతుల పై ఎందుకు చూపడం లేదని ఆయన ప్రశ్నించారు. పాడి రైతులు, వారి సమస్యలను గాలికి వదిలేసి.. అమూల్‌కు ప్రమోటర్‌గా మారడాన్ని విమర్శించారు. రాష్ట్ర నిధులతో పాటు ఉపాధి హామీ నిధులను అమూల్ అమూల్ సంస్థ కోసం దారి మళ్లిస్తున్నారన్నారు.
అనంతపురం సభలో అవాస్తవాలు ప్రచారం చేశారంటూ లేఖలో మండిపడ్డారు. స్థానిక డెయిరీల పై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అమూల్ వల్ల లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు అదనంగా లబ్ధి అనేది అవాస్తవమంటు వివరించారు. అమూల్ సంస్థ కోసం రూ. 3 వేల కోట్లు ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి చెందిన శివశక్తి పాల డెయిరీ రాష్ట్రంలో అతి తక్కువ ధరకు పాలు కొంటున్న విషయాన్ని లేఖలో పేర్కొన్నారు.సహకార డెయిరీలను పునరుద్ధరిస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బాలామృతం, అంగన్ వాడీలకు పాల సరఫరా చేయడానికి అమూల్‌తో ఒప్పదం చేసుకోవడం సరికాదని అచ్చెన్నాయుడు తన లేఖ ద్వారా తెలిపారు.