- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ, వైసీపీల మధ్య ఫ్లెక్సీ వార్.. డీజిల్ దొంగంటూ వెలసిన ఫ్లెక్సీపై జేసీ రియాక్షన్
దిశ, డైనమిక్ బ్యూరో: అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయం హాట్ హాట్‌గా నడుస్తోంది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నట్లుగా రాజకీయం మారిపోయింది. కొన్ని రోజులుగా టీడీపీ, వైసీపీల మధ్య ఫ్లెక్సీల వార్ నెలకొంది. ఇరు వర్గాలు ఒకరికి మరోకరు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వేస్తూ రాజకీయాన్ని మరింత హీటెక్కిస్తున్నారు. తాజాగా నియోజకవర్గంలో మరోసారి ఫ్లెక్సీల వార్ తారాస్థాయికి చేరింది. డీజిల్ దొంగ ఎవరంటూ జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్నంగా స్పందించారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫొటో చూపిస్తూ ఇద్దరం దొంగలమేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నువ్వు గజదొంగ.. ప్రజల సొమ్మును దొచుకున్న గజదొంగ నువ్వు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాత్రం తాడిపత్రి ప్రజల మనసును దోచుకున్న దొంగను.. నా గుండె ఎప్పుడూ తాడిపత్రి.. తాడిపత్రి అనే కొట్టుకుంటుంది. ఒకసారి చూడరా బుడ్డోడా.. నువ్వు తాడిపత్రి మొత్తాన్ని దోచేస్తున్నావ్.. నీకు సిగ్గు లేదా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ వచ్చిన రెండేళ్ల సమయంలో డీజిల్ ఏం చేశారో సమాధానం చెప్పు? అని నిలదీశారు. ఎన్ని ఫ్లెక్సీలు వేయించినా నిన్ను జనం నమ్మరు అని హెచ్చరించారు. ఇంకా ఏడాది మాత్రమే ఉందని దోచుకో దాచుకో అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.