- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CM Chandrababu Naidu : దావోస్ లో చంద్రబాబు మొదటి సమావేశం

దిశ, వెబ్ డెస్క్ : దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం(Davos WEF)లో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) పలువురు రాష్ట్ర మంత్రులతో సహ జ్యూరిచ్(Zurich) చేరుకున్న విషయం తెలిసిందే. కాగా సోమవారం సాయంత్రం జ్యూరిచ్ లోని తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. 'జాబ్స్ ఫర్ తెలుగు'(Jobs For Telugu) పేరిట నిర్వహించిన ఈ సదస్సులో ఏపీలో ఉద్యోగ, ఉపాధి, పెట్టుబడి అవకాశాలపై పలువురు తెలుగు పారిశ్రామికవేత్తలు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఏపీని క్రిప్టొ హబ్(Crypto HUB) గా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) మాట్లాడుతూ.. తాము ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తున్నామని, 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు ఇచ్చేలా బోర్డు ఏర్పాటు చేశామని తెలియజేశారు. అదే విధంగా ఏపీలో విశాలమైన రహదారులు, అతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులు ఉన్నాయని పేర్కొన్నారు.