- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏప్రిల్ నుంచి ప్రభుత్వంపై పోరుబాట: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డు కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారంపై అలుపెరగని పోరాటం చేస్తామని ఉద్యోగ సంఘాలు ప్రకటిస్తున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 11 వ పీఆర్సీపై ఉద్యమం జరుగుతున్న సమయంలో సీఎం వైఎస్ జగన్, మంత్రివర్గ ఉపసంఘం అంగీకరించిన డిమాండ్లు అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతీ నెల ఒకటో తారీఖునే జీతాలు ఇవ్వాలని అలాగే ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం చేయాలని గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేశాయి ఉద్యోగ సంఘాలు.
తాజాగా మరోసారి భారీ స్థాయిలో ప్రభుత్వంపై తిరుగుబాటుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఏపీ జేఏసీ అమరావతి పోరుబాటకు సైరన్ మోగించింది. ఇందులో భాగంగా సీఎస్ డా.కేఎస్ జవహర్ రెడ్డికి నోటీసులు సైతం ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తాము కూడా ఉద్యమబాట పట్టబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. సాధారణ నిరసనలతో ఈ ప్రభుత్వం స్పందించదని అందుకే ఆందోళనలను తీవ్రతరం చేయాలని నిర్ణయించినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే ఆర్ సూర్యనారాయణ ప్రకటించారు. ఇక ప్రభుత్వంతో అమితుమీ తేల్చుకుంటామని ప్రకటించారు.
సీఎం హామీయే నెరవేరలేదు..
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీల కంటే ముందు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. సీఎం జగన్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే సవాళ్లు విసరడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇదే సందర్భంలో సందట్లో సడేమియా అన్న చందంగా ఉద్యోగ సంఘాలు సైతం తమ ఉద్యమ కార్యచరణకు సైరన్ మోగిస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో ప్రభుత్వాన్ని దిగివచ్చేలా ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు ఉద్యోగ సంఘాలు ప్లాన్ వేస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఇక ఉద్యమానికి సన్నద్ధమవుతున్నట్లు ప్రకటించాయి.
ఉద్యోగుల డబ్బులు ఎవరికి మళ్లిస్తున్నారు.. పనిచేసిన కాలానికి 1 జీతాలు ఎందుకు ఇవ్వరు? అంతేకాదు తాము దాచుకున్న డబ్బులు తిరిగి తమ అవసరాలకు ఎందుకు ఇవ్వరు? అని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.‘ మాకు రావాల్సిన అరియర్సు/డి ఏ బకాయిలు, కొత్త డి ఏ , లీవ్ ఎన్ క్యాష్ మెంట్లు ఇలాంటి ఆర్దికపరమైన అంశాలు అన్నింటి పైన స్పష్టమైన లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని, ఈ ఉద్యమం వలన ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలిగినా సరే దాని ఉద్యోగులుగా తాము బాధ్యులం కాదని...దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, దీనికి ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమవుతుందని ఉద్యోగ సంఘాలు ప్రకటిస్తున్నాయి.
ఏప్రిల్‌నుంచి ఉద్యమం షురూ: కేఆర్ సూర్యనారాయణ
ఉద్యోగుల సమస్యలపై ఏప్రిల్ నుంచి ప్రభుత్వంపై పోరు సాగించబోతున్నాం అని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే ఆర్ సూర్యనారాయణ ప్రకటించారు. ఇప్పటికే ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రూ. 12 వేల కోట్లు దాటిపోయాయని... ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సైతం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగుల జీతభత్యాలకు చట్టబద్ధత కల్పించాలన్న తమ డిమాండ్‌కు 1.13 లక్షల మంది మద్దతుగా నిలిచారు అని గుర్తు చేశారు. రాష్ట్రంలో సగటున ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం రూ. 2.25 లక్షల నుంచి రూ. 3.5 లక్షల వరకు బకాయి ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాదు డీఏ బకాయిలు సైతం రెండు విడతలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
అలాగే ఉద్యోగులకు జీపీఎఫ్ చెల్లింపులు చేయడం లేదు అని చెప్పుకొచ్చారు. ఈ అంశాలపై తమతో ఎవరు కలిసి వచ్చి పోరాటం చేద్దామన్నా కలిసి వస్తామని చెప్పుకొచ్చారు. పోరాటం చేసే వారిని స్వాగతిస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలు తీవ్రత లేని ఉద్యమం చేశాయని కానీ ఈసారి మాత్రం తీవ్రత గట్టిగా ఉండేలా నిరసనలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ నుంచి ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. అవసరమైతే సమ్మెకు సైతం వెనుకాడేది లేదని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కే ఆర్ సూర్యనారాయణ హెచ్చరించారు.
ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ ప్రకటన
మార్చి 1 నుంచి ఉద్యమానికి కలసి వచ్చే ఉద్యోగ సంఘాల/ట్రేడ్ యూనిన్/ప్రజాసంఘాల మద్దతు కోరే కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. మార్చి రెండు నుంచి 5 వరకు 26 జిల్లాలలో ఉద్యమానికి ఉద్యోగులను సిద్ధం చేసేందుకు అన్నిసంఘాలతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తామని నోటీసుల్లో తెలిపారు. మార్చి 9,10 తేదీల్లో నల్ల బ్యాడ్జిలతో విధులకు హాజరవుతామని తెలిపారు. మార్చి 13,14 తేదీల్లో భోజన విరామ సమయంలో ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. మార్చి 15/17/20 తేదీల్లో అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలవద్ద ధర్నాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
‘మార్చి 21న ఒక్క రోజు సెల్ డౌన్, మార్చి 21 నుండి వర్క్‌టూ రూల్ ప్రారంభం. మార్చి 24 న అన్ని హెడ్ ఆఫీస్‌ల వద్ద ధర్నాలు. మార్చి 27న కరోనాతో చనిపోయిన ఉద్యోగులు కుటుంబ సభ్యులు పరామర్శ. ఏప్రిల్ 1న సీపీఎస్ ఉద్యోగులు కుటుంబాల పరామర్శ. ఏప్రిల్ 3న ఛలో కలక్టరేట్ కార్యక్రమం ద్వారా స్పందనలో ఉద్యోగుల సమస్యతో రిప్రజెంటేషన్ ఇవ్వడం. ఏప్రిల్ 5న రాష్ట్ర కార్యవర్గ సమావేశం.. రెండో ఫేజ్ భవిష్యత్ కార్యాచరణ, కీలక నిర్ణయాలు ప్రకటన చేస్తాం’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు నోటీసులలో వెల్లడించిన సంగతి తెలిసిందే.